తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ‘కాసాని’కి మాతృ వియోగం

తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కాసాని కౌసల్య(92) మంగళవారం కన్నుమూశారు. 2007-12 వరకు బాచుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా ఆమె సేవలందించారు.

Updated : 01 Feb 2023 05:43 IST

నిజాంపేట, న్యూస్‌టుడే, ఈనాడు, అమరావతి: తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కాసాని కౌసల్య(92) మంగళవారం కన్నుమూశారు. 2007-12 వరకు బాచుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా ఆమె సేవలందించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కౌసల్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. బాచుపల్లిలోని కాసాని నివాసంలో ఆమె మృతదేహాన్ని ఉంచారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. కాసాని కౌసల్య ముదిరాజ్‌ మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కౌసల్య మృతి పట్ల మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, పార్టీ కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాచుపల్లి సర్పంచిగా కౌసల్య చేసిన సేవలు ఎనలేనివని వారు ఓ ప్రకటనలో కొనియాడారు. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు సైతం కౌసల్య మృతికి సంతాపం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు