Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి

మెదడు సంబంధిత సమస్య మినహా నందమూరి తారకరత్న అవయవాలన్నీ సాధారణ స్థితిలో పనిచేస్తున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

Updated : 02 Feb 2023 07:25 IST

ఈనాడు, బెంగళూరు:  మెదడు సంబంధిత సమస్య మినహా నందమూరి తారకరత్న అవయవాలన్నీ సాధారణ స్థితిలో పనిచేస్తున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన తారకరత్న చికిత్స పొందుతున్న బెంగళూరులోని నారాయణ హృదయాలయను సందర్శించారు. వైద్యులతో చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 40 నిమిషాల పాటు గుండెకు రక్త ప్రసారం స్తంభించిపోవటంతో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తాయని తెలిసిందన్నారు. ప్రస్తుతం ఎడిమాతో తారకరత్న బాధపడుతున్నారని చెప్పారు. గురువారం నుంచి ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు. తారకరత్న ఆరోగ్యం పట్ల నందమూరి బాలకృష్ణ చూపుతున్న శ్రద్ధను కొనియాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు