ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాలు

గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఈ కామర్స్‌ విధానంలో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకాలు చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.

Published : 02 Feb 2023 03:55 IST

ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఈ కామర్స్‌ విధానంలో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకాలు చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వారు తయారు చేసిన ఉత్పత్తులకు వారే ధరను నిర్ణయించి అమ్మకాలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. ఆన్‌లైన్‌ అమ్మకాలపై విజయవాడలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసాపురంలో నిరుపయోగంగా ఉన్న అలంకృతి లేస్‌ పార్కును పునరుద్ధరించేందుకు సీడాప్‌ సీఈవో సత్యనారాయణతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని