శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని దేవస్థాన ప్రతినిధులు బుధవారం ఆహ్వానించారు.

Updated : 02 Feb 2023 06:34 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని దేవస్థాన ప్రతినిధులు బుధవారం ఆహ్వానించారు. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి, ఆలయ ఈవో లవన్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్‌, డైరీలను అందజేశారు.


జనవరిలో శ్రీవారికి రూ.122.68 కోట్ల హుండీ కానుకలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారికి జనవరి మాసంలో దాదాపు రూ.122.68 కోట్ల హుండీ కానుకలను భక్తులు సమర్పించారు. జనవరి 2వ తేదీన అత్యధికంగా రూ.7.68 కోట్లు వచ్చాయి. ప్రతి నెల శ్రీవారి హుండీ కానుకలు రూ.వంద కోట్లు దాటుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని