జగన్‌ను కలిసిన ప్రేరణకర్త నిక్‌ వుజిసిక్‌

 ప్రఖ్యాత ప్రేరణకర్త, రచయిత నిక్‌ వుజిసిక్‌ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. నిక్‌ వుజిసిక్‌ను జగన్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

Published : 02 Feb 2023 03:55 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి:  ప్రఖ్యాత ప్రేరణకర్త, రచయిత నిక్‌ వుజిసిక్‌ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. నిక్‌ వుజిసిక్‌ను జగన్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిక్‌ మాట్లాడుతూ..‘‘ సీఎం జగన్‌ను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. నా జీవితం గురించి ఆటిట్యూడ్‌ ఈజ్‌ ఆల్టిట్యూడ్‌ పేరుతో పదో తరగతి ఆంగ్లంలో ఓ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడం ఆనందం కలిగించే అంశం’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని