శ్రీ అన్న చేయూతనిచ్చేనా?
చిరుధాన్యాల వాడకం ద్వారా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నా.. వాటిని సాగు చేసే రైతులకు మాత్రం కలిసి రావడం లేదు. పెట్టుబడులు పెరుగుతున్నాయి.
చిరుధాన్యాల రైతుల ఆశ
ఈనాడు-అమరావతి: చిరుధాన్యాల వాడకం ద్వారా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నా.. వాటిని సాగు చేసే రైతులకు మాత్రం కలిసి రావడం లేదు. పెట్టుబడులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులతో దిగుబడులూ అనుకూలించడం లేదు. ఎకరాకు 3, 4 క్వింటాళ్లు వస్తే ఎక్కువన్నట్లు ఉంది. అధిక దిగుబడినిచ్చే వంగడాలు లేకపోవడమూ దీనికొక కారణం. ‘శ్రీ అన్న’ పథకం ద్వారా చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాలని, పరిశోధన మండలి ద్వారా చేయూతనందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్ల కిందటే మిల్లెట్ మిషన్ ఏర్పాటు చేసింది. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి చేయూత లభిస్తే వెనకబడిన జిల్లాల్లోని వర్షాధార ప్రాంతాల్లో సాగు పెరుగుతుంది. రైతులకు ప్రయోజనం లభిస్తుంది.
6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
చిరుధాన్యాల సాగులో మొదటి స్థానం, ఎగుమతుల్లో రెండో స్థానంలో భారత్ నిలిచింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే.. ఉత్పత్తిలో మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తర్వాత ఏపీ ఉంది. 1990-2000 మధ్య కాలంతో పోలిస్తే అన్ని రకాల చిరుధాన్యాల సాగు 15లక్షల ఎకరాలనుంచి 4లక్షల ఎకరాలకు పడిపోయినట్లు అంచనా. ఈ మేరకు ఉత్పత్తీ తగ్గింది. కొర్ర, వరిగ, సామ తదితర చిరుధాన్యాల ఉత్పత్తి 2016-17లో 24వేల టన్నులు ఉండగా.. 2021-22 సంవత్సరంలో 13 వేల టన్నులకు పడిపోయింది.
రైతులేం కోరుతున్నారంటే..
* అధిక దిగుబడినిచ్చే వంగడాలు
* క్వింటాకు రూ.5వేలకు తగ్గకుండా మద్దతు ధర
* మద్దతు ధరపై ప్రభుత్వమే కొనడం
* ప్రతి మండలంలోనూ చిరుధాన్యాల ప్రాసెసింగ్ కేంద్రాలు
* కేంద్రాలను ఏర్పాటుచేసే యువతకు రాయితీ రుణాలు
* ఉపఉత్పత్తుల తయారీపై పొదుపు సంఘాలకు శిక్షణ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!
-
India News
Anurag Thakur: ‘రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు’
-
Movies News
Rana: రానా.. చిన్నప్పటి ఇంటిని చూశారా..!
-
Sports News
Virender Sehwag: అప్పుడు వాళ్లను వీర బాదుడు బాదుతాను అన్నాను.. కానీ : సెహ్వాగ్