కేంద్ర పన్నుల వాటాల్లో స్వల్ప పెరుగుదల

2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.41,338.02 కోట్లు, తెలంగాణకు రూ.21,470.84 కోట్లు దక్కనున్నాయి.

Updated : 02 Feb 2023 04:53 IST

ఈనాడు, దిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.41,338.02 కోట్లు, తెలంగాణకు రూ.21,470.84 కోట్లు దక్కనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.10,21,448.16 కోట్లు పంపిణీ చేస్తుండగా ఏపీకి 4.047%, తెలంగాణకు 2.102% వాటా రానుంది. ఈసారి రాష్ట్రాలకు వచ్చే పన్ను వాటా 7.70% పెరగనుండడంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏపీకి రూ.3,161.28 కోట్లు, తెలంగాణకు రూ.1,802.69 కోట్ల చొప్పున అధికంగా నిధులు వస్తాయి. 15వ ఆర్థిక సంఘ సూత్రాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏటా నిధులను పంపిణీ చేస్తుంది. దీని ప్రకారం కేంద్ర పన్నుల్లో అత్యధిక మొత్తం ఉత్తర్‌ప్రదేశ్‌ (రూ.1,83,237 కోట్లు), బిహార్‌ (రూ.1,02,737.26 కోట్లు), మధ్యప్రదేశ్‌ (రూ.80,183.67 కోట్లు), పశ్చిమబెంగాల్‌ (రూ.76,843.55 కోట్లు), మహారాష్ట్ర (రూ.64,524.88 కోట్లు), రాజస్థాన్‌ (రూ.61,552.47 కోట్లు) రాష్ట్రాలకు వెళుతోంది. 28 రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మొత్తంలో 55.71 శాతం వాటా ఈ ఆరు రాష్ట్రాలకు దక్కుతోంది. దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలకు కలిపి రూ.1,61,388.81 కోట్లు వస్తుండగా, ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌కే వీటన్నిటికీ కలిపి ఇచ్చిన మొత్తంకంటే 13.53% అధికంగా దక్కుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు