నేత్రపర్వంగా నారసింహుని రథోత్సవం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీ నారసింహస్వామి కల్యాణోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి.

Published : 02 Feb 2023 03:55 IST

న్యూస్‌టుడే, అంతర్వేది: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీ నారసింహస్వామి కల్యాణోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. బుధవారం రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినంలో మధ్యాహ్నం 2.20 గంటలకు మెరకవీధి నుంచి కదిలిన రథం జన సమూహంలోంచి పరుగులు తీసింది. భక్తులు రథాన్ని లాగుతూ దివ్య నామస్మరణ చేశారు. అక్కడ్నించి స్వామివారి సోదరి అయిన అశ్వరూఢాంబిక ఆలయం వద్దకు వెళ్లి తిరిగి 16 కాళ్ల మండప సమీపానికి చేరుకోవడంతో రథోత్సవ ఘట్టం పూర్తయింది. ఆలయ అనువంశిక ఛైర్మన్‌ కలిదిండి కుమారరామగోపాల రాజా బహద్దూర్‌, కలెక్టర్లు హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ఆర్డీవో వసంతరాయుడు తొలుత రథం వద్ద కొబ్బరికాయలు కొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని