‘మిస్తీ’తోనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంటుందా?

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ‘మిస్తీ’ (మాంగ్రూవ్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ షోర్‌లైన్‌ హాబిటేట్స్‌ అండ్‌ టాంగిబుల్‌ ఇన్‌కమ్స్‌) పథకాన్ని సమర్థంగా వినియోగించుకోగలిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవుల విస్తీర్ణం పెరగటానికి దోహదపడనుంది.

Published : 02 Feb 2023 04:36 IST

రాష్ట్రంలో 24 వేల హెక్టార్లలో  మడ అడవులు కనుమరుగు
కేంద్ర పథకాన్ని సమర్థంగా  వినియోగించుకుంటే   విస్తీర్ణం పెంచేందుకు దోహదం

ఈనాడు, అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ‘మిస్తీ’ (మాంగ్రూవ్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ షోర్‌లైన్‌ హాబిటేట్స్‌ అండ్‌ టాంగిబుల్‌ ఇన్‌కమ్స్‌) పథకాన్ని సమర్థంగా వినియోగించుకోగలిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవుల విస్తీర్ణం పెరగటానికి దోహదపడనుంది. తీర ప్రాంతానికి సహజ రక్షాకవచంలా ఉపయోగపడే మడ అడవులు రాష్ట్రంలో 1987 నాటికి 49,500 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండేవి. ప్రస్తుతం వాటి విస్తీర్ణం 40,500 హెక్టార్లకు పడిపోయింది. ఈ 35 ఏళ్లలో 24 వేల ఎకరాల విస్తీర్ణంలో మడఅడవులు కనుమరుగైపోయాయి. గోదావరి, కృష్ణా డెల్టాల్లో కొందరు వీటిని ఆక్రమించి చేపలు, రొయ్యలు చెరువులు తవ్వేశారు. వీటిని పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే.. ఇళ్ల పట్టాల కోసమంటూ కాకినాడ శివార్లలో ఏకంగా 116 ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులను నరికేయడం వైకాపా హయాంలో చోటుచేసుకున్న పరిణామం. ఈ నేపథ్యంలో మడ అడవుల పునరుద్ధరణ, కొత్త ప్రాంతాల్లో నాటి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మిస్తీ పథకాన్ని ఉపయోగించుకోవటంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఓ మాదిరిగా ఉంది. తీర ప్రాంతం వెంబడి, ఉప్పు నేలల్లో మడ మొక్కలు పెద్ద ఎత్తున నాటేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని