రాష్ట్రంలో పెరుగుతున్న ‘గన్ కల్చర్’
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ‘గన్ కల్చర్’ పెరుగుతోంది. ప్రత్యర్థులను, గిట్టనివారిని అంతమొందించేందుకు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లకు పాల్పడేందుకు తుపాకులు వినియోగించే ధోరణి శరవేగంగా విస్తరిస్తోంది.
మూలాలపై దృష్టి పెట్టని పోలీసులు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ‘గన్ కల్చర్’ పెరుగుతోంది. ప్రత్యర్థులను, గిట్టనివారిని అంతమొందించేందుకు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లకు పాల్పడేందుకు తుపాకులు వినియోగించే ధోరణి శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల తెదేపా నాయకుడు బాలకోటిరెడ్డిపై తుపాకీతో కాల్పులు జరపడం.. రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రానికి చెందిన కొందరు రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగినవారు అక్రమాయుధాల ముఠాలతో సంబంధాలు పెట్టుకుని వాటిని రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. అవసరమున్న వారికి అమ్ముతున్నారు. మరికొందరైతే ఉత్తరప్రదేశ్, బిహార్, దిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వీటిని తీసుకొస్తున్నారు. రొంపిచర్ల ఘటనలో వినియోగించిన తుపాకీని నిందితుడు రాజస్థాన్ నుంచి కొని తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా విశాఖపట్నం మన్యంలో పాగా వేస్తున్న, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్న గంజాయి ముఠాలు పెద్ద ఎత్తున తుపాకులు వినియోగిస్తున్నాయి. ఎవరైనా ఎదురుతిరిగితే కాల్పులు జరిపేందుకు కూడా వీరు వెనుకాడట్లేదు. వాహనాల తనిఖీల్లోనూ అక్రమాయుధాలు పట్టుబడుతున్న ఉదంతాలున్నాయి.
ఇవిగో నిదర్శనాలు
* అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆయన కుమారుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు.
* పెళ్లికి నిరాకరించిందని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన ఓ యువతిని మాలపాటి సురేష్‌రెడ్డి అనే యువకుడు తుపాకీతో కాల్చాడు. తర్వాత అదే తుపాకీతో తాను కాల్చుకుని చనిపోయాడు. అమెరికా నుంచి ఈ గన్ దిగుమతి చేసుకున్నట్లు తేలింది.
* శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇటీవల తుపాకులతో తిరుగుతూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల్లో ఒకరు కానిస్టేబుల్ కావడం గమనార్హం.
* విజయవాడ పోలీసు కమిషనరేట్ ఉద్యోగి జి.మహేష్‌పై కొంతమంది వ్యక్తులు కాల్పులు జరిపి అతణ్ని హతమార్చారు. ఈ తుపాకీ బిహార్‌లో కొన్నట్లు తేలినా నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించలేదు.
* నకిలీ మావోయిస్టుగా అవతారమెత్తిన ఓ సైనికుడు.. ఉత్తరప్రదేశ్‌లో తుపాకీ కొని బంగారం వ్యాపారి ఇంటిపై కాల్పులు జరిపాడు. రూ.5 కోట్లు చెల్లించాలని బెదిరించాడు. పార్వతీపురం పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
* అనకాపల్లికి చెందిన భీశెట్టి లోకనాథం కొన్నాళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా... రెండు తుపాకులు, 18 రౌండ్ల తూటాలు దొరికాయి. గాజువాకలోని న్యూపోర్టు ప్రాంతానికి చెందిన రాజుభాయ్‌తో కలిసి దిల్లీలోని గ్యాంగ్‌స్టర్ వద్ద వీటిని కొన్నట్లు తేలింది.
అప్పటికప్పుడు హడావుడే!
తుపాకుల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నా అడ్డుకట్ట వేయటంపై పోలీసులు దృష్టి సారించట్లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఒకటి, రెండు రోజులు హడావుడే తప్ప తుపాకులు, తూటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే మూలాలు ఛేదించకపోవడం నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. నిఘా లేకపోవడమూ అక్రమాయుధాల వినియోగం పెరుగుదలకు కారణమవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Movies News
SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్