ఇనుప చువ్వలు.. సిమెంటు బస్తాలు ఎత్తుకుపోతున్నారు..

విజయవాడ మండలం నున్న జగనన్న కాలనీల్లో దొంగల బెడద ఎక్కువైంది. ఇంటి నిర్మాణం కోసం పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇనుప చువ్వలు, సిమెంటు బస్తాలను రాత్రివేళ దొంగలు ఎత్తుకుపోతున్నారు.

Published : 03 Feb 2023 04:50 IST

విజయవాడ మండలం నున్న జగనన్న కాలనీల్లో దొంగల బెడద ఎక్కువైంది. ఇంటి నిర్మాణం కోసం పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇనుప చువ్వలు, సిమెంటు బస్తాలను రాత్రివేళ దొంగలు ఎత్తుకుపోతున్నారు. ఇసుక, కంకరనూ వదలడం లేదు. నున్న గ్రామానికి  7 కిలోమీటర్ల దూరంలో ఊరి చివరన పొలాల మధ్యన లేఅవుట్‌ ఉండటంతో ఏ మాత్రం రక్షణ లేని పరిస్థితి. రామవరప్పాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాల లబ్ధిదారులకు ఇక్కడ జగనన్న ఇళ్ల స్థలాలను కేటాయించారు. రాత్రివేళల్లో కాపలా ఉండటానికి వీలుండటం లేదని వారంతా వాపోతున్నారు. ఇనుప చువ్వలకు తాళాలు వేసుకుని కాపాడుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు