వచ్చే నెలలో దేవాలయ పర్యాటకం

రాష్ట్రంలోని నాలుగు సర్క్యూట్లలో వచ్చే నెలలో దేవాలయ పర్యాటకాన్ని (టెంపుల్‌ టూరిజం) ప్రారంభిస్తామని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఛైర్మన్‌ ఎ.వరప్రసాద్‌రెడ్డి తెలిపారు. 

Published : 03 Feb 2023 05:17 IST

నాలుగు సర్క్యూట్లలో బస్సులు నడిపేలా ప్రణాళిక
ఏపీటీడీసీ ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని నాలుగు సర్క్యూట్లలో వచ్చే నెలలో దేవాలయ పర్యాటకాన్ని (టెంపుల్‌ టూరిజం) ప్రారంభిస్తామని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఛైర్మన్‌ ఎ.వరప్రసాద్‌రెడ్డి తెలిపారు.  ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మల్‌రెడ్డి, గోవిందరావుతో కలిసి ఇందుకు సంబంధించిన క్యాలెండర్‌ను ఛైర్మన్‌ గురువారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడ-శ్రీశైలం, విజయవాడ-తిరుమల, విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-అరసవల్లి ప్రాంతాలను సర్క్యూట్లుగా విభజించి వీటి మధ్య బస్సులు నడపాలని నిర్ణయించాం. ఒక్కో సర్క్యూట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ 10-12 దేవాలయాలను చేర్చుతున్నాం. వీటిలో భక్తులకు దేవాదాయ ధర్మాదాయశాఖ సహకారంతో ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు రోజుల ప్యాకేజీ అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేట్‌ ఆపరేటర్లతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.  ఆన్‌లైన్‌తోపాటు ప్రైవేట్‌ ఏజెంట్ల దగ్గర టికెట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు