విద్యార్థులు సంఘసేవను అలవర్చుకోవాలి

విద్యార్థులంతా విద్యాభ్యాసంతోపాటు సంఘసేవను అలవరచుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. చదువులకు ఆటంకం లేకుండా సేవ చేసే అవకాశాన్ని అందించే జాతీయ సేవా పథకంలో (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రతి విద్యార్థీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Published : 04 Feb 2023 04:52 IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు, అమరావతి: విద్యార్థులంతా విద్యాభ్యాసంతోపాటు సంఘసేవను అలవరచుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. చదువులకు ఆటంకం లేకుండా సేవ చేసే అవకాశాన్ని అందించే జాతీయ సేవా పథకంలో (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రతి విద్యార్థీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జనవరి 26న దిల్లీలో గణతంత్ర వేడుకల కవాతులో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా వారు అందించిన సేవలు, దిల్లీలో కవాతు శిక్షణ తదితర అంశాలను ఆయనకు నివేదించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, జాతీయస్థాయిలో అవార్డులు పొందిన రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమ అధికారులు డాక్టర్‌ పి.అశోక్‌రెడ్డి, జితేంద్ర గౌడ్‌, పార్థసారథి, సిరి దేవనపల్లి, డి.సాయి, దిల్లీలో కవాతులో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు వందన, భువనేశ్వరి, రమ్య, మహాలక్ష్మి, దేదీప్య, వీఎస్‌ఎన్‌ లక్ష్మణ్‌, దీపక్‌ రెడ్డి, బి.గోపి, ఎస్‌.రెడ్డి జిష్ణు, జె.వాసు ఉన్నారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  సిసోడియా, సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
ః దిల్లీలో ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌)కు సంబంధించి జాతీయ స్థాయి పురస్కారాలు పొందిన ఏపీ వాసులు శుక్రవారం సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరింత రాణించాలని సూచించారు. జాతీయ సేవా పథకానికి సంబంధించి 2019-20, 2020-21 సంవత్సరాలకుగాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా.. డాక్టర్‌ పి.అశోక్‌రెడ్డి. కె.జితేంద్రగౌడ, సీహెచ్‌ పార్థసారథి, సిరి దేవనపల్లి, డి.సాయిలు పురస్కారాలు అందుకున్నారు. వీరిని సీఎం అభినందించారు. రిపబ్లిక్‌డే పరేడ్‌లో ఏపీ విద్యార్థులు వందన, భువనేశ్వరి, పాలవలస రమ్య, శ్రీమహాలక్ష్మి, దీదేప్య, వీఎస్‌ఎన్‌ లక్ష్మణ్‌, గౌతమ్‌ దీపక్‌రెడ్డి, బి.గోపి, రెడ్డి జిష్ణు, జె.వాసు పాల్గొన్నారు. వారిని సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి అశోక్‌రెడ్డి, పి.రామచంద్రరావు తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు