AP Govt: రాజధాని కేసులను త్వరగా విచారించండి: సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

రాజధాని కేసులు త్వరగా విచారణకు వచ్చేలా మెన్షనింగ్‌ జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ మహఫూజ్‌ నజ్కీ లేఖ రాశారు.

Updated : 05 Feb 2023 07:27 IST

ఈనాడు, దిల్లీ: రాజధాని కేసులు త్వరగా విచారణకు వచ్చేలా మెన్షనింగ్‌ జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ మహఫూజ్‌ నజ్కీ లేఖ రాశారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతేడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పునకు అనుకూలంగా పలువురు రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై గతేడాది నవంబరు 28న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నాడు కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేశారు. కానీ ఆరోజు విచారణకు రాలేదు. కేసును అత్యవసరంగా విచారించాలని మహఫూజ్‌ నజ్కీ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు శనివారం లేఖ రాశారు. సోమవారం నాటి మెన్షనింగ్‌ జాబితాలో ఈ కేసును చేర్చాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు కంప్యూటర్‌ జనరేటెడ్‌ జాబితాలో మాత్రం ఈ కేసు మంగళవారం విచారణకు రానున్నట్లు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని