గడప గడపకూ నీటి కష్టాలు!

చుట్టూ అపార జల వనరులున్నా పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని కొన్ని వార్డుల్లో ప్రజలు గొంతు తడుపుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

Published : 05 Feb 2023 05:39 IST

చుట్టూ అపార జల వనరులున్నా పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని కొన్ని వార్డుల్లో ప్రజలు గొంతు తడుపుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శివారు ప్రాంతాలైన ప్రకాశ్‌నగర్‌, ఆరేటినగర్‌ కాలనీలు ఏర్పడి దశాబ్దం దాటినా పైపులైను వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ప్రాంతాల్లో ప్రతి ఇంటి ముందు 3, 4 డ్రమ్ములు పెట్టుకుని ట్యాంకరు వచ్చినప్పుడు వాటిలో నీటిని నిల్వ చేసుకుంటున్నారు. ఆ నీటినే బకెట్లు, బిందెలతో పట్టుకుని తీసుకెళ్తున్నారు. మరికొందరు డ్రమ్ములకు తాత్కాలికంగా పైపులు అమర్చి నీటిని మోటార్లతో ఇళ్లలోని ట్యాంకులకు మళ్లిస్తున్నారు. ఈ సమస్యపై పురపాలక కమిషనరు శివరామకృష్ణ స్పందిస్తూ.. అమృత్‌ పథకం కింద పట్టణంలోని 3 ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకుల నిర్మాణం జరుగుతోందన్నారు. ట్యాంకుల నుంచి పైపులైన్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు.

ఈనాడు, భీమవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు