‘ఓపి’క పట్టాల్సిందే

విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మాతాశిశు సంక్షేమ విభాగం వద్ద ఓపీ నమోదు కోసం గంటల కొద్ది నిలబడాల్సి రావడంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందిపడుతున్నారు.

Published : 05 Feb 2023 04:54 IST

విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మాతాశిశు సంక్షేమ విభాగం వద్ద ఓపీ నమోదు కోసం గంటల కొద్ది నిలబడాల్సి రావడంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందిపడుతున్నారు. కేవలం ఎన్టీఆర్‌ జిల్లా నుంచే కాకుండా కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి గర్భిణులు, బాలింతలు మెరుగైన వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తారు. వారందరికీ వైద్య సేవలందించడానికి ఇక్కడ భవనాలు సరిపోవడం లేదు. సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. గర్భిణుల అవస్థలు చూసి గత ప్రభుత్వ హయాంలో తల్లీపిల్లల అదనపు విభాగం సముదాయాన్ని రూ.18 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిర్మాణం పునాది దశలోనే ఆగిపోయింది. తీసుకొచ్చిన సిమెంటు కూడా పాడైంది.

ఈనాడు అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు