మద్యం కొనుగోలుదారుల ఫొటోల సేకరణ

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మద్యం కొనేవారి ఫొటోలు తీయడంపై వివాదం నెలకొంది. శనివారం చేజర్ల మండలానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి మూడు మద్యం సీసాలు అడిగారు.

Published : 05 Feb 2023 04:54 IST

గొలుసు దుకాణాల నియంత్రణకంటున్న సిబ్బంది

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మద్యం కొనేవారి ఫొటోలు తీయడంపై వివాదం నెలకొంది. శనివారం చేజర్ల మండలానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి మూడు మద్యం సీసాలు అడిగారు. మద్యం ఇచ్చే ముందు సిబ్బంది అతని ఫొటో తీశారు. ఎందుకని ఆ వ్యక్తి ప్రశ్నించడంతో వివాదం ఏర్పడింది. కొద్దిరోజులుగా దుకాణాల్లో మూడు, అంత కన్నా ఎక్కువ బాటిళ్లు తీసుకొనేవారి ఫొటోలు తీస్తున్నారు. దుకాణాల సిబ్బంది నంబర్లతో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటుచేసి అందులో ఈ ఫొటోలు పెడుతున్నారు. ఒకచోట కొన్న వ్యక్తి మరో ప్రాంతానికి వస్తే గుర్తించేందుకు చేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. బస్టాండు కూడలిలో ఉన్న దుకాణం సిబ్బంది బెల్టుషాపుల వారికి విక్రయించడంతో ఇద్దరిని తొలగించామని అంటున్నారు. ఈ విషయమై ఎక్సైజ్‌ సీఐ రామారావును వివరణ కోరగా గొలుసు దుకాణాలను నియంత్రించేందుకే ఇలా మూడు బాటిళ్ల కన్నా ఎక్కువగా తీసుకెళ్లేవారి ఫొటోలు తీసి గ్రూపులో పెడుతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని