డిమాండుకు తగినట్లు మద్యం సరఫరా అవుతోందా?

దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని పలు సందర్భాల్లో చెప్పిన సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఇప్పుడు మందుబాబులతో మరింత ఎక్కువగా తాగించటమెలా?

Published : 05 Feb 2023 04:54 IST

ఎన్ని రోజులకోసారి స్టాకు వస్తోంది?
ఏ రకం మద్యం ఎక్కువగా తాగుతున్నారు?
మద్యం అమ్మకాలు పెంచుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం సర్వే

ఈనాడు, అమరావతి: దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని పలు సందర్భాల్లో చెప్పిన సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఇప్పుడు మందుబాబులతో మరింత ఎక్కువగా తాగించటమెలా? తద్వారా ఆదాయం ఇంకా పెంచుకోవటమెలా.. అనేదానిపై దృష్టిసారించింది.  అమ్మకాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి? మందుబాబులు ఎలాంటి మద్యం తాగటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? ఏ వయసువారు ఎక్కువగా కొంటున్నారు? డిమాండుకు తగ్గట్లుగా మద్యం సరఫరా అవుతోందా.. లేదా? వంటి అంశాలపై ఈ సర్వే చేయిస్తోంది. లోటుపాట్లు ఎక్కడున్నాయో చూసుకుని వాటికి అనుగుణంగా మార్కెటింగ్‌ వ్యూహాలు రూపొందించుకోవటం, అమ్మకాలు పెంచుకోవటమే ఈ   సర్వే లక్ష్యంగా కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల సూపర్‌వైజర్లకు ఓ  ప్రశ్నావళిని పంపించింది. ఆన్‌లైన్‌లో సమాధానాలివ్వాలని ఆదేశించింది. ఇటీవల బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఈ ప్రశ్నావళికి సమాధానాలు పంపించాలని సూపర్‌వైజర్లను ఆదేశించారు. జిల్లా పేరు, మద్యం డిపో, నియోజకవర్గం, మద్యం దుకాణం లైసెన్సు సంఖ్య తదితర వివరాలను పొందుపరిచి.. ఈ సర్వేకు సూపర్‌వైజర్లు సమాధానాలు ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని