Andhra News: వలస కూలీగా సర్పంచి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు సర్పంచి రామతీర్థం నాగరాజు వలస కూలీగా మారారు. ప్రస్తుతం ఆయన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగులపాలెంలో కుటుంబంతోపాటు వలస వచ్చి మిరప కోతల కూలీకి వెళ్తున్నారు.

Updated : 05 Feb 2023 06:47 IST

బొల్లాపల్లి, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు సర్పంచి రామతీర్థం నాగరాజు వలస కూలీగా మారారు. ప్రస్తుతం ఆయన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగులపాలెంలో కుటుంబంతోపాటు వలస వచ్చి మిరప కోతల కూలీకి వెళ్తున్నారు. నాగరాజు గత పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుతో సర్పంచిగా గెలుపొందారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక పిల్లలిద్దర్నీ చదువు మాన్పించి పనులకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘ఎలాగూ అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదు. మండల సమావేశాలకూ అధికారులు నన్ను పిలవడం లేదు. మా ప్రాంతంలో పనులూ లేవు. అందుకే కుటుంబంతో కలిసి పనులకు వచ్చా’ అని నాగరాజు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని