రోడ్డు అడిగితే రాళ్ల దాడి

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని వైకాపాలో వర్గపోరు మరోమారు బహిర్గతమైంది. దాచేపల్లి మండలం పొందుగల పంచాయతీ శ్రీనివాసపురంలో శనివారం రాత్రి జరిగిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.

Updated : 06 Feb 2023 09:29 IST

‘గడపగడపకు మన ప్రభుత్వం’లో ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో ఘటన
సొంత పార్టీ వారి ఇంటిపైనే వైకాపా శ్రేణుల దాష్టీకం

దాచేపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని వైకాపాలో వర్గపోరు మరోమారు బహిర్గతమైంది. దాచేపల్లి మండలం పొందుగల పంచాయతీ శ్రీనివాసపురంలో శనివారం రాత్రి జరిగిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. చివరగా ఓ ఇంటి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేను వీధిలో మిగిలిన రోడ్డు వేయాలని వైకాపా నేత ఒకరు కోరారు. త్వరలో రోడ్డు వేయిస్తానంటూ ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు, పార్టీ శ్రేణులు, పోలీసులు భోజనాలకు ఉపక్రమించారు. ఈలోపు మరో వైకాపా నేత కుమారుడు కొందరిని వెంట తెచ్చుకుని రోడ్డు కోసం ప్రశ్నించిన నాయకుడి ఇంటిపైకి రాళ్లు విసిరారు. దాంతో అందరూ ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నారు. ఇంటి లోపల రాళ్లు పడ్డాయి. బయట తలుపులు పగులగొట్టారు. ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి దాడి చేస్తున్నవారిని అక్కడినుంచి పంపించారు. ఒకే సామాజికవర్గమైన ఈ రెండు కుటుంబాలు వైకాపాలోనే ఉన్నాయి. దగ్గరి బంధుత్వమూ ఉంది. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వైనాన్ని మనసులో పెట్టుకున్న ఆ నేత సొంత పార్టీ నాయకుడి ఇంటిపైనే దాడికి దిగారు. భయాందోళనకు గురైన బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించడంతో గ్రామంలో పికెట్‌ ఏర్పాటుచేశారు. ఫిర్యాదు అందలేదని దాచేపల్లి పోలీసులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని