Viveka Murder Case: సీఎం జగన్‌ తలుచుకొని ఉంటే... వివేకా హత్య కేసు పది రోజుల్లో తేలిపోయేది

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తలుచుకొని ఉంటే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పది రోజుల్లోనే తేలిపోయేదని ఆ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అన్నారు.

Updated : 06 Feb 2023 08:49 IST

అప్రూవర్‌గా మారిన దస్తగిరి వెల్లడి

ఈనాడు డిజిటల్‌, కడప: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తలుచుకొని ఉంటే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పది రోజుల్లోనే తేలిపోయేదని ఆ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అన్నారు. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని మలిదశలో సీబీఐ విచారిస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఆదివారం సీబీఐ అధికారుల ముందు దస్తగిరి హాజరయ్యారు. అనంతరం న్యాయస్థానం విచారణకు హాజరు నిమిత్తం సమన్లు అందుకున్నారు. ఈ సందర్భంగా దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘త్వరలో నిజాలు వెలుగులోకి వస్తాయి. అన్ని విషయాలు నిగ్గు తేలుతాయి. ఇంతకాలం నేను చెప్పింది అబద్ధమన్నారు. అబద్ధమైతే ఇంత వరకు కేసు వ్యవహారం ఎందుకు నడుస్తుంది. కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయడం శుభపరిణామం. నేను సంధించిన ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయి. సీబీఐ అధికారులు పక్కా సమాచారంతోనే విచారణకు పలువురిని పిలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంతనేది సీబీఐ త్వరలోనే వెల్లడిస్తుందని నమ్ముతున్నా. రాష్ట్రంలో జగన్‌ సీఎంగా ఉండడంతోనే విచారణ ఆలస్యమవుతోంది. అన్ని విషయాలు న్యాయస్థానంలో చెబుతాను. వాస్తవాల కోసం రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తున్నారు’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని