Andhra News: సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించాననడంలో వాస్తవం లేదు: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 3న కడప కేంద్ర కారాగారం మీదుగా వెళ్తూ ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు, అక్కడి నుంచి విమానంలో విజయవాడకు తాను ప్రయాణించాననే వార్తలు సత్యదూరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు.

Updated : 06 Feb 2023 08:23 IST

ఈనాడు, అమరావతి: వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 3న కడప కేంద్ర కారాగారం మీదుగా వెళ్తూ ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు, అక్కడి నుంచి విమానంలో విజయవాడకు తాను ప్రయాణించాననే వార్తలు సత్యదూరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. వాటిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘‘సింహాద్రిపురం మండలం అహోబిలపురం భానుకోట సోమేశ్వరాలయ మహా కుంభాభిషేకంలో పాల్గొనేందుకు ఈ నెల 2వ తేదీ రాత్రి 11 గంటలకు నేను రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నా. 3వ తేదీ ఉదయం 9.50 గంటల సమయంలో వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నా. అదేరోజు మధ్యాహ్నం ముద్దనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశమయ్యా. అది ముగియగానే 4.40 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి రాత్రి 8.15 కి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నా. కడప కలెక్టర్‌, ఇతర అధికారులు వీడ్కోలు పలికారు. రాత్రి 9 గంటలకు స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణించి హైదరాబాద్‌కు చేరుకున్నా’’ అని వివరించారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని