23న సుప్రీంకోర్టులో రాజధాని కేసుల విచారణ

రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 23న సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

Published : 07 Feb 2023 02:24 IST

ఈనాడు, దిల్లీ: రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 23న సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లను త్వరగా విచారించాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి సోమవారం ప్రస్తావించారు. తమ తరఫు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారిమన్‌ 19వ తేదీన అందుబాటులో ఉండరని, ఆ తర్వాత విచారణ జాబితాలో చేర్చాలని రైతుల తరఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ కేసు విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ విచారణ జాబితాలో తొలి కేసుగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆలోపు ప్రతివాదులు కౌంటర్‌ వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని