ఆర్టీసీ పోర్టల్‌ ద్వారా శ్రీశైలం దర్శన టికెట్లు

తిరుపతి తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు 9 నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ పోర్టల్‌ ద్వారా దర్శనం టికెట్లు నమోదు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Updated : 08 Feb 2023 06:30 IST

వినుకొండ, న్యూస్‌టుడే: తిరుపతి తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు 9 నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ పోర్టల్‌ ద్వారా దర్శనం టికెట్లు నమోదు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సర్వ దర్శనానికి 275, అతిశీఘ్ర దర్శనానికి 300, శీఘ్ర దర్శనానికి 500 మొత్తం 1,075 టికెట్లు నిత్యం కేటాయిస్తున్నట్లు తెలిపారు. నెల, రెండు నెలల్లో కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, అన్నవరం, విజయవాడ కనకదుర్గగుడి, శ్రీకాశహస్తి, సింహాచలంలో ఈ విధానం అమలు చేసేందుకు దేవాదాయ శాఖ అధికారులతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. శివరాత్రికి కోటప్పకొండ, శ్రీశైలం శైవక్షేత్రాలతో పాటు ఇతర చోట్లకు తిరిగే బస్సులకు గత ఏడాది టికెట్‌ ధరే ఇప్పుడూ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో శ్రీశైలం దర్శనం టికెట్లు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల్లో ఆన్‌లైన్‌ ద్వారా రూ.500, రూ.200 దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 11 నుంచి 21వతేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని