ఆ వివరాలా.. తర్వాత ఇస్తాం

ఎస్సీల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధుల కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.

Updated : 08 Feb 2023 05:10 IST

‘ఉప ప్రణాళిక’ వివరాలపై మంత్రి మేరుగు దాటవేత

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎస్సీల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధుల కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. అయితే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద ప్రభుత్వం ఏటా ఎన్ని నిధులు కేటాయించాలి? ఎంత కేటాయిస్తోంది? ఖర్చు చేసిందెంత అనే వివరాల్ని తర్వాత చెబుతామని దాటవేశారు. రాష్ట్రంలో 16.4% మంది ఎస్సీలు ఉండగా..ఆ ప్రకారం ఏటా నిధుల కేటాయిస్తున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా స్పందించారు. 100% నిధుల్ని ప్రత్యేకంగా ఎస్సీల సంక్షేమం, వారు నివసిస్తున్న ఆవాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలని చట్ట నిబంధనను ప్రభుత్వం పాటిస్తోందా అని ప్రశ్నించగా....ఎస్సీల జనాభా కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తున్నామంటే దాని అర్థమేంటని ఎదురు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని