AP Constable Exam: అభ్యర్థుల గోడు వినండి.. మొదటి కీలో ఒకలా.. తుది కీలో మరోలా!

పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాల్లో ఒక ప్రశ్నకు సంబంధించి ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసిన ‘కీ’లలో సమాధానాలను ఒక్కోసారి ఒక్కోలా పేర్కొనడంపై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 08 Feb 2023 08:51 IST

రెండు జవాబులూ సరైనవే

ఈనాడు, విశాఖపట్నం: పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాల్లో ఒక ప్రశ్నకు సంబంధించి ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసిన ‘కీ’లలో సమాధానాలను ఒక్కోసారి ఒక్కోలా పేర్కొనడంపై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సరైన రెండు ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోకపోవడంతో అర్హత మార్కుల దగ్గరకొచ్చిన వారు నష్టపోతున్నారు. రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే కొందరు ఈ-మెయిల్‌ ద్వారా బోర్డుకు విన్నవించారు. కానిస్టేబుల్‌ ఎంపికకు ప్రాథమిక రాత పరీక్షను జనవరి 22న నిర్వహించి ఫిబ్రవరి 5వతేదీన ఫలితాలు విడుదల చేశారు.

విశాఖ హనుమంతువాకకు చెందిన అభ్యర్థి బి.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. ‘ప్రశ్నపత్రం సెట్‌ బీలోని 184వ ప్రశ్నలో ‘కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి’ అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఆ నాలుగింటికి సమాధానాలు 2, 4లలో ఉన్నాయి. జనవరి 23న బోర్డు విడుదల చేసిన ప్రాథమిక కీ లో రెండో ఆప్షన్‌, ఫిబ్రవరి 5న ఇచ్చిన తుది కీ లో నాలుగో ఆప్షన్‌ సరైనదని బోర్డు పేర్కొంది. రెండుసార్లు రెండు రకాలుగా పేర్కొనడంతో నష్టపోతున్నామని.. రెండింటిలో ఏ సమాధానమిచ్చినా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని