420 మంది విద్యార్థులు.. రెండే మరుగుదొడ్లు

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర పోస్టుమెట్రిక్‌ వసతిగృహంలో అందిస్తున్న భోజనం, సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు.

Published : 08 Feb 2023 04:35 IST

భోజనం, ఇతర సమస్యలపై ఆందోళన

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర పోస్టుమెట్రిక్‌ వసతిగృహంలో అందిస్తున్న భోజనం, సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేస్తూ బైఠాయించారు. అధ్వాన పరిస్థితుల మధ్య ఎలా చదవాలని ప్రశ్నించారు. 420 మంది విద్యార్థులకు రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉండటంతో కళాశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. గిరిజన విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారితో గిరిజన సంక్షేమ శాఖ డీడీ సూర్యనారాయణ, ఎస్‌ఐ ఫకృద్దీన్‌ చర్చించారు. గదుల్లో అవసరమైనన్ని ఫ్యాన్‌లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని వసతిగృహ సంరక్షణాధికారిని డీడీ ఆదేశించారు. ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని