అందరికీ ఒక్క‘సారే’ బోధన

పాఠశాల విలీన ప్రక్రియ విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులు వందల్లో ఉంటే ఉపాధ్యాయుడు ఒక్కరే పాఠాలు బోధించాల్సిన దుస్థితి.

Published : 08 Feb 2023 04:35 IST

పాఠశాల విలీన ప్రక్రియ విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులు వందల్లో ఉంటే ఉపాధ్యాయుడు ఒక్కరే పాఠాలు బోధించాల్సిన దుస్థితి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని శ్రీరామనగర్‌ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 203 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు, ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారు. పాఠశాల విలీన ప్రక్రియ అనంతరం ముగ్గురు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు బదిలీ చేశారు. కేవలం ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ఇక్కడ మిగిలారు. ఐదు తరగతులకు ఆయనే బోధించాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ‘నాడు-నేడు’ కింద రూ.64 లక్షలతో మూడు గదుల పనులు సాగుతున్నాయి. దీంతో గదుల కొరత ఉంది. ఓ వైపు నాడు-నేడు పనులు చూస్తూ... మరోవైపు ఐదు తరగతులకు బోధించలేక ప్రధానోపాధ్యాయుడు నానాతంటాలు పడుతున్నారు.  

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని