దళితుల భూముల్లో నిమ్మ మొక్కల తొలగింపు

వైయస్‌ఆర్‌ జిల్లాలో వైకాపా నాయకులు నిత్యం ఏదో ఒక చోట భూకబ్జాలకు పాల్పడుతూ దౌర్జన్యాలకు దిగుతున్నారు.

Published : 08 Feb 2023 04:35 IST

పొలాలు లాక్కుంటున్నారని బాధితుల ఆవేదన

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే- మైదుకూరు: వైయస్‌ఆర్‌ జిల్లాలో వైకాపా నాయకులు నిత్యం ఏదో ఒక చోట భూకబ్జాలకు పాల్పడుతూ దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామ ఎస్సీలు సాగు చేసుకుంటున్న భూమిలోకి వైకాపా నేతలు ప్రవేశించి నిమ్మ మొక్కలు తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. పొలం పనులు చేసుకుంటున్న ఎస్సీలను అక్కడి నుంచి తరిమేశారు. గ్రామస్థుడు సంబుటూరు వెంకటయ్యతో పాటు ఇతరులకు చెందిన 5 ఎకరాల భూమికి ప్రభుత్వం గతంలో డీకేటీ పట్టాలు ఇచ్చింది. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలోకి వైకాపా నేతలు ఎల్లారెడ్డి, రఘురామిరెడ్డి, నరసింహారెడ్డి, 50 మంది కార్యకర్తలు ప్రవేశించారు. నిమ్మ మొక్కలు తొలగించి, వారిని బెదిరించి భూమిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. తెదేపా మైదుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ మంగళవారం అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. మహిళలు ఆయన కాళ్లపై పడి.. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. బాధితులకు అండగా ఉంటామని, న్యాయపోరాటం చేస్తామని సుధాకర్‌ హామీ ఇచ్చారు. ఎసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా సిఫార్సు చేయించుకుని ఈ భూములను ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు