మాణిక్యాంబదేవికి 2 కిలోల స్వర్ణ చీర

కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి గ్రామస్థులు స్వర్ణ చీర బహూకరించారు.

Published : 08 Feb 2023 04:35 IST

కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి గ్రామస్థులు స్వర్ణ చీర బహూకరించారు. గ్రామస్థులంతా చందాలు వేసుకుని 2 కిలోల బంగారంతో అమ్మవారికి చీర తయారు చేయించినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. గ్రామోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో పూజలు చేసి, స్వర్ణ చీరను అమ్మవారికి అలంకరించారు.

న్యూస్‌టుడే, పెదపూడి (జి.మామిడాడ)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని