ఏపీకి చేసిన సాయం ఏమిటి?

‘తుపాన్లు, వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు కలిగిన నష్టం గురించి మీకు తెలుసా... తెలిస్తే చేసిన సాయం ఏమిటో తెలపాలి’ అని తిరుపతి ఎంపీ గురుమూర్తి మంగళవారం పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించారు.

Published : 08 Feb 2023 05:20 IST

తిరుపతి, న్యూస్‌టుడే: ‘తుపాన్లు, వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు కలిగిన నష్టం గురించి మీకు తెలుసా... తెలిస్తే చేసిన సాయం ఏమిటో తెలపాలి’ అని తిరుపతి ఎంపీ గురుమూర్తి మంగళవారం పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించారు. 2021లో రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా రైతులు భారీగా పంటలు నష్టపోయారని, రోడ్లు దెబ్బతిన్నాయంటూ కేంద్రానికి రాష్ట్రం లేఖ రాసిందన్నారు. తమకు కలిగిన నష్టం రూ.6054.29 కోట్లుగా ఉందని, తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయాలని అభ్యర్థించిందన్నారు. స్పందించిన కేంద్ర గృహ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ మాట్లాడుతూ... ‘రాష్ట్రం నుంచి ఎలాంటి నివేదిక కోసం ఎదురు చూడకుండానే నష్టాన్ని అంచనా వేసేందుకు మేం కమిటీని ఏర్పాటు చేశాô. ఈ కమిటీతోపాటు మరో రెండు కమిటీల సూచనలకు అనుగుణంగా రూ.351.43 కోట్లు సాయం చేశాం. ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.895.20 కోట్లు రెండు దఫాలుగా విడుదల చేశాం’ అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు