అక్రమ క్వారీల దందా అరికట్టాలి

చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలనుంచి గ్రానైట్‌ రాయి రాయల్టీ చెల్లించకుండా భారీగా తరలిపోతోందని, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కోరారు.

Published : 08 Feb 2023 05:20 IST

ఆంధ్ర, తమిళనాడు ప్రభుత్వాలకు చంద్రబాబు లేఖ

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలనుంచి గ్రానైట్‌ రాయి రాయల్టీ చెల్లించకుండా భారీగా తరలిపోతోందని, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన రెండు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, కుప్పం మండలాల్లో అధికంగా అక్రమ క్వారీలు నడుస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వెలికితీసిన దిమ్మెలను భారీ వాహనాల్లో తమిళనాడుకు తరలిస్తున్నారని వివరించారు. కుప్పం మండలం నడిమూరు-తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వట్నంపల్లి మార్గం, గుడుపల్లె మండలం ఓఎన్‌ కొత్తూరు-తమిళనాడులోని వేపనపల్లె, కుప్పం మండలం మోట్లచేను- తమిళనాడులోని పచ్చూరు మీదుగా రవాణా సాగుతోందని పేర్కొన్నారు. ఈ దందాకు రెండు రాష్ట్రాల రాజకీయ నాయకుల అండదండలున్నాయని ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రాల ఖజానాకు గండి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని