బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ ఉపయోగం లేని పథకం

‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం ఉపయోగం లేనిది. గత ప్రభుత్వంలో అనర్హులకు దాన్ని అమలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్నే కార్పొరేట్‌కు దీటుగా తయారు చేసి ఎస్సీ, ఎస్టీలను చదివిస్తున్నాం.

Published : 08 Feb 2023 05:20 IST

మంత్రి మేరుగు నాగార్జున

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం ఉపయోగం లేనిది. గత ప్రభుత్వంలో అనర్హులకు దాన్ని అమలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్నే కార్పొరేట్‌కు దీటుగా తయారు చేసి ఎస్సీ, ఎస్టీలను చదివిస్తున్నాం. రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు సిద్ధం. సవాలును స్వీకరించాలి’ అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువే చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం...ప్రత్యేకంగా వారికే ఉద్దేశించిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాన్ని, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటును రద్దు చేయడం అన్యాయం కాదా అని ప్రశ్నించగా పైవిధంగా బదులిచ్చారు.

లోకేశ్‌తో బహిరంగ చర్చకు సిద్ధమే...

చంద్రబాబుతో కలిసి లోకేశ్‌  వస్తే రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి ప్రకటించారు. ఎప్పుడు, ఎక్కడికి రావాలో వారే చెప్పాలన్నారు. గిరిజన పోలీసు అధికారిని బంధిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టరా అని ప్రశ్నించారు. దళితుల్ని అగౌరవపరిస్తే లోకేశ్‌, చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టడానికైనా వెనుకాడబోమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని