Viveka Murder Case: నేడు హైదరాబాద్‌కు వివేకా హత్య కేసు నిందితులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఐదుగురు నిందితులు తొలిసారిగా శుక్రవారం సీబీఐకోర్టు ముందు హాజరుకానున్నారు.

Updated : 09 Feb 2023 09:15 IST

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఐదుగురు నిందితులు తొలిసారిగా శుక్రవారం సీబీఐకోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి వేర్వేరుగా వారెంట్లు, సమన్లు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు కడప నుంచి హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ప్రథమంగా విచారణ చేపట్టనుంది.

కడప కేంద్ర కారాగారంలో ముగ్గురు నిందితులకు ప్రొడెక్షన్‌ వారెంట్‌ జారీ కాగా... బెయిలుపై ఉన్న మరో ఇద్దరికి సీబీఐ నుంచి సమన్లు జారీ అయ్యాయి. దీంతో నిందితులు గురువారం హైదరాబాద్‌ వెళ్లనున్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో పాటు   ఇదే కేసులో బెయిల్‌పై ఉన్న ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు.   నిందితులను ప్రత్యేక రక్షణతో హైదరాబాద్‌ తరలించడానికి ఏర్పాట్లు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని