ట్యాపింగ్ కాదు.. అది ఆడియో రికార్డింగ్
‘ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి, నాకు పదిహేనేళ్లుగా అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్, వైకాపాతో సంబంధం ఉంది. ప్రస్తుతం రాజకీయాలు వదిలి కాంట్రాక్టు ఫీల్డ్‌లో సెటిలయ్యా.
తానే రికార్డు చేశానన్న కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి
ఈనాడు డిజిటల్, నెల్లూరు: ‘ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి, నాకు పదిహేనేళ్లుగా అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్, వైకాపాతో సంబంధం ఉంది. ప్రస్తుతం రాజకీయాలు వదిలి కాంట్రాక్టు ఫీల్డ్‌లో సెటిలయ్యా. కోటంరెడ్డి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఓ కాంట్రాక్టరు విషయంలో అసహనం వ్యక్తం చేశారు. నాది ఐఫోన్ కాదు. ఆటోమేటిక్‌గా కాల్ రికార్డు అవుతుంది. ఆ రికార్డును యాదృచ్ఛికంగా ఆ కాంట్రాక్టరుకు వినిపించా. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు’ అని కోటంరెడ్డి స్నేహితుడు లంకా రామశివారెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రెండుసార్లు ఎమ్మెల్యేగా కోటంరెడ్డి గెలవడంతో సంతోషించా. డిసెంబరులో కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం ఛానల్స్‌లో చూశా. అదే రోజు రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే నాకు ఫోన్ చేశారు. రావత్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందని సలహా ఇచ్చా. ఆ సమయంలో ఫోన్ రికార్డు అయింది. శ్రీధర్‌రెడ్డిని ఇబ్బంది పెట్టాలని నేను ఆ పని చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇంతలా ఆరోపణలు వస్తాయని ఊహించలేదు. కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నానని చెప్పడం ఆందోళన కలిగించింది. అందుకే బయటకు వచ్చా. నాపై అధికార పార్టీ నేతల బెదిరింపులు లేవు. వైఎస్‌ఆర్ భక్తుడిగా మీడియా ముందుకు వచ్చా’అని రామశివారెడ్డి తెలిపారు. ఆ ఆడియో వినిపించాలని విలేకరులు కోరగా.. ఇప్పుడు తన వద్ద లేదని, స్టోరేజి ఫుల్ కావడంతో తీసేశానని తెలిపారు. ఆ కాంట్రాక్టరు ఎవరనేది తాను బయటపెట్టనని అన్నారు. దర్యాప్తు సంస్థలు కోరితే మాత్రం వివరాలు చెబుతానని, తన ఫోన్‌ను ఫోరెన్సిక్ విభాగానికి ఇచ్చేందుకు సిద్ధమని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni - Raina: అప్పుడు ధోనీ రోటీ, బటర్చికెన్ తింటున్నాడు..కానీ మ్యాచ్‌లో ఏమైందంటే: సురేశ్‌రైనా
-
General News
APCRDA: ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడివారైనా ప్లాట్లు కొనుక్కోవచ్చు.. సీఆర్డీఏ కీలక ప్రకటన
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
General News
TSPSC:పేపర్ లీకేజీ.. నలుగురు నిందితులకు కస్టడీ
-
India News
Rahul Gandhi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన... పలుచోట్ల ఉద్రిక్తత
-
Movies News
Manchu Manoj: ట్విటర్ వేదికగా మంచు మనోజ్ ట్వీట్స్.. విష్ణును ఉద్దేశించేనా?