పుష్కరిణిలో 464 ఏళ్ల నాటి శివలింగాలు

గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి పుష్కరిణి (పెదకోనేరు)లో 464 ఏళ్ల నాటి 2 శివలింగాలు బుధవారం వెలుగుచూశాయి.

Published : 09 Feb 2023 02:51 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి పుష్కరిణి (పెదకోనేరు)లో 464 ఏళ్ల నాటి 2 శివలింగాలు బుధవారం వెలుగుచూశాయి. దేవాదాయశాఖ ఇటీవల పెదకోనేరు పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కోనేటిలో నీటిని తొలగిస్తున్నారు. బుధవారం నాటికి వంద అడుగుల మేర నీటిని తోడారు. శివలింగాలు, ప్రపత్తి ఆంజనేయస్వామి ఆలయం కనిపించాయి. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆప్కో ఛైర్మన్‌ గంజి చిరంజీవి, అధికారులు వాటికి ప్రత్యేక పూజలు చేశారు. ఊట మాత్రం పెద్దఎత్తున వస్తుండటంతో అధికారులు నిత్యం నీటిని తోడుతూనే ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు