సౌర వెలుగుల్లో చవకైన పయనం!

పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మోటారు మెకానిక్‌ మస్తాన్‌వలి సౌరశక్తితో నడిచే ద్విచక్రవాహనాన్ని తయారు చేశారు.

Published : 09 Feb 2023 02:51 IST

పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మోటారు మెకానిక్‌ మస్తాన్‌వలి సౌరశక్తితో నడిచే ద్విచక్రవాహనాన్ని తయారు చేశారు. చదువు రాకపోయినా.. మెకానిక్‌గా చేసిన అనుభవంతో వాహనాన్ని రూపొందించారు. ఇందుకు రూ.30 వేలతో బైక్‌ విడిభాగాలు, రూ.45 వేలతో బ్యాటరీని కొనుగోలు చేశారు. ముందుగా బైక్‌ చేసి దానికి బ్యాటరీని అనుసంధానించి, నడిపించారు. ఆ తర్వాత 55 వాట్స్‌ సామర్థ్యం గల సౌర పలకలను బైక్‌ పైభాగంలో బిగించారు. వాటితో బ్యాటరీ ఛార్జింగ్‌ అయ్యేలా ఏర్పాటు చేశారు. గంట పాటు వాహనం ఎండలో ఉంటే 40 కి.మీ. ప్రయాణించే వీలుంది. ఒక్కసారి బ్యాటరీ పూర్తి ఛార్జింగ్‌ అయితే వందకుపైగా కిలోమీటర్లు ప్రయాణించొచ్చని మస్తాన్‌వలీ తెలిపారు. ప్రయాణ సమయంలోనూ ఛార్జింగ్‌ అవుతుంది. బ్యాటరీలో ఛార్జింగ్‌ మోతాదు, స్పీడో మీటరు, మైలేజీ చూసుకునే ఏర్పాట్లూ చేసుకున్నారు. ఇప్పుడొస్తున్న ఈ-బైక్‌లకు సోలార్‌ ప్లేట్లు అమర్చుకుంటే ఛార్జింగ్‌ చింత ఉండదని మస్తాన్‌వలి అభిప్రాయపడుతున్నారు.

 ఈనాడు గుంటూరు- న్యూస్‌టుడే, పిడుగురాళ్ల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు