Andhra News: ఇదీ.. నాడు-నేడు తరగతి!

పైకప్పు పెచ్చులూడి, దుమ్ముకొట్టుకుపోతున్న ఈ భవనం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు జిల్లా పరిషత్తు పాఠశాలది. భవనం మరమ్మతులకు ‘నాడు-నేడు’ రెండో విడతలో రూ.42 లక్షలు కేటాయించారు.

Published : 13 Feb 2023 08:16 IST

పైకప్పు పెచ్చులూడి, దుమ్ముకొట్టుకుపోతున్న ఈ భవనం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడు జిల్లా పరిషత్తు పాఠశాలది. భవనం మరమ్మతులకు ‘నాడు-నేడు’ రెండో విడతలో రూ.42 లక్షలు కేటాయించారు. రూ.6లక్షలు విడుదల చేశారు. బడులు ప్రారంభమైనప్పుడు పనులు మొదలుపెట్టారు. ఫ్లోరింగ్‌ తీసేశారు. సిమెంటు బస్తాలు, చువ్వలు తెచ్చి తరగతి గదుల్లో వేశారు. ఇసుక తెచ్చి ప్రాంగణంలో పోశారు. ఆ తర్వాత నిధులు రాలేదు. పనులు ఎక్కడివక్కడే ఆగాయి. విద్యార్థులు దుమ్ము లేస్తున్న తరగతి గదుల్లోనే కూర్చోవాల్సి వస్తోంది. మరోవైపు భవన పైకప్పు చువ్వలు తేలి భయపెడుతోంది. వాటికి ప్యాచ్‌ వర్క్‌ చేసేదెప్పుడు..? ఫ్లోరింగ్‌ వేసేదెప్పుడు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరమ్మతులు వేసవి సెలవుల్లో చేసినా విద్యార్థులకు ఇబ్బంది ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.

ఈనాడు, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని