Andhra News: మళ్లీ అప్పునకు అనుమతి

కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త రుణాలకు రాష్ట్రానికి అనుమతులు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.2,929 కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణాలకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది.

Updated : 18 Feb 2023 04:49 IST

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త రుణాలకు రాష్ట్రానికి అనుమతులు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.2,929 కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణాలకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. విద్యుత్తు రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కేంద్ర ఇంధనశాఖ సిఫార్సుతో కొత్త రుణాలకు ఆస్కారం ఏర్పడింది. రాష్ట్రంలో విద్యుత్తు సంస్కరణలు అమలుచేస్తే జీఎస్‌డీపీలో 0.5% అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ కోటాలోనే అదనపు రుణం మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ కొత్త రుణంతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.52,789 కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణాలకు అవకాశం లభించినట్లయింది. మార్చి నెలాఖరు వరకు ఈ రుణం పొందే వీలుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని