Kurnool: రూ.3.50 కోట్ల విలువైన 1924 సెల్‌ఫోన్ల రికవరీ

కర్నూలు నగరంలోని జిల్లా పోలీసు కవాతు మైదానంలో ఆదివారం సెల్‌ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. రూ.3.50 కోట్ల విలువ చేసే 1924 సెల్‌ఫోన్లు బాధితులకు అందించినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు.

Published : 27 Feb 2023 07:20 IST

కర్నూలులో నాలుగో విడత మేళా

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలోని జిల్లా పోలీసు కవాతు మైదానంలో ఆదివారం సెల్‌ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. రూ.3.50 కోట్ల విలువ చేసే 1924 సెల్‌ఫోన్లు బాధితులకు అందించినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. మొత్తం నాలుగు విడతల మేళాల్లో రూ.12 కోట్ల విలువ చేసే 5727 సెల్‌ఫోన్లు రికవరీ చేశామన్నారు. ఈ విడతలో కర్నూలు జిల్లాతో పాటు బాపట్ల, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కడప, నంద్యాల జిల్లాలు, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, బిహార్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వారి ఫోన్లు రికవరీ చేశామన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు మీసేవా కేంద్రంలో గానీ, కర్నూలు పోలీసు లింక్‌ను గానీ సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.ప్రసాద్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వెంకటాద్రి, సీఐలు శ్రీనివాసులు, శంకరయ్య, అబ్దుల్‌గౌస్‌, తిమ్మారెడ్డి, ఆర్‌ఐ పోతురాజు, సైబర్‌ల్యాబ్‌ ఎస్సై వేణుగోపాల్‌, ఆర్‌ఎస్సై రమేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని