జగనన్న విద్యాదీవెన మళ్లీ వాయిదా

జగనన్న విద్యాదీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసింది. సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం గత నెల 28న విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఈ నెల 7వ తేదీకి మార్చింది.

Updated : 07 Mar 2023 04:59 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసింది. సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం గత నెల 28న విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఈ నెల 7వ తేదీకి మార్చింది. తాజాగా దాన్ని మళ్లీ వాయిదా వేసినట్లు జిల్లాలకు సమాచారం పంపింది. తదుపరి తేదీని ప్రకటించలేదని జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికిగాను 10.50 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ.700 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్ని విడుదల చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని