Annavaram: సత్యదేవుని వ్రతానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని వ్రతం, నిత్య కల్యాణం, ఇతర పూజలకు భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనాలనే నిబంధనను మంగళవారం నుంచి అమలు చేస్తున్నారు.

Updated : 08 Mar 2023 08:30 IST

అన్నవరం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని వ్రతం, నిత్య కల్యాణం, ఇతర పూజలకు భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనాలనే నిబంధనను మంగళవారం నుంచి అమలు చేస్తున్నారు. 2019 జులైలోనే దీనిని అమల్లోకి తెచ్చినా అధికారులు పట్టించుకోవడం మానేశారు. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఇన్‌ఛార్జి ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదేశాలిచ్చారు. వ్రతం, ఇతర పూజల్లో పాల్గొనేందుకు పురుషులు పంచె, కండువా, లేదా కుర్తా, పైజమా, మహిళలు చీర లేదా కుర్తా, పైజమా తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని