AP Budget: ఫ్యాన్సీ నంబర్లా! బడ్జెట్‌ అంచనాలా!!

ఈ అంకె చూస్తుంటే మంచి ఫ్యాన్సీ నంబరు గుర్తొస్తోంది కదూ.! దీనికి చాలా ప్రాధాన్యం ఉంది.

Updated : 17 Mar 2023 10:09 IST

రూ. 2,79,279.27 కోట్లు

ఈ అంకె చూస్తుంటే మంచి ఫ్యాన్సీ నంబరు గుర్తొస్తోంది కదూ.! దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2023-24 బడ్జెట్‌ అంచనాల మొత్తం. ఈ అన్ని అంకెలు కలిపితే మొత్తం సంఖ్య 9.

రూ. 2,56,256.56 కోట్లు

ఇదీ మరో ఫ్యాన్సీ నంబరులా ఉంది కదా!  2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మంత్రి బుగ్గన సమర్పించిన నాటి బడ్జెట్‌ అంచనాల మొత్తం ఇది.

రూ. 2,29,779.27 కోట్లు

ఇందులో కూడా... కేవలం 3 అంకెలు మాత్రమే మళ్లీ మళ్లీ వచ్చేలా కూర్చారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాలు. ఈ అంకెలు కలిపితే వచ్చేది తొమ్మిదే.

ప్రతి ఆర్థిక సంవత్సరంలో దాదాపు డిసెంబరు నెల నుంచే ప్రభుత్వశాఖల నుంచి అంచనాలు తీసుకుంటూ ఉంటారు. చర్చలు జరుపుతారు. ఆయా శాఖలు అంతకు ముందు ఏడాది ఏ మేరకు ఖర్చు చేశాయో పరిశీలిస్తారు. ఆ ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం ఇవ్వాలో, రాబడి అంచనాలు, అవసరాలు, ప్రాధాన్యాల ఆధారంగా తేలుస్తారు. ఇన్ని కోణాల్లో ఆలోచించి లెక్కలు తేల్చే క్రమంలో కూడా ఇలా...  ఫ్యాన్సీ నంబర్లు సాధించ గలుగుతున్నారంటే బడ్జెట్‌ కసరత్తు ఏ స్థాయిలో జరుగుతోందన్నది చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని