సీఎంపై నమ్మకంతోనే భారీ ఎత్తున పెట్టుబడులు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై ఉన్న నమ్మకంతోనే ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధమయ్యారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Published : 19 Mar 2023 05:26 IST

మంత్రి అమర్‌నాథ్‌

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై ఉన్న నమ్మకంతోనే ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధమయ్యారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలివ్వాలనే బిల్లును తెచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ‘ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు - పెట్టుబడులు - యువతకు నైపుణ్యాభివృద్ధి - ఉపాధి’ అనే అంశంపై శాసనసభలో లఘు చర్చను శనివారం ఆయన ప్రారంభించారు. పెట్టుబడుల సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులకు 386 ఒప్పందాలను కుదుర్చుకున్నామని తెలిపారు. వచ్చే మార్చిలోపు 33 పరిశ్రమల్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల సదస్సులో విద్యుత్తు రంగానికి సంబంధించి రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 10 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు ముకేశ్‌ అంబానీ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటిస్థానంలో నిలపడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని ఆ శాఖ మంత్రి రోజా తెలిపారు. పెట్టుబడుల సదస్సులో 129 ఒప్పందాలను కుదుర్చుకున్నామని 41,412 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు