ప్రభుత్వం దిగొచ్చే వరకూ ఉద్యోగుల పోరు

సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగుసేవల ఉద్యోగులకు వేతనాల పెంపు, కరోనా సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు తదితర డిమాండ్ల సాధనకు.. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Published : 19 Mar 2023 03:46 IST

ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగుసేవల ఉద్యోగులకు వేతనాల పెంపు, కరోనా సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు తదితర డిమాండ్ల సాధనకు.. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల ఏపీ ఐకాస అమరావతి సంఘ నాయకులు.. శనివారం విజయవాడలోని నగరపాలక సంస్థ, పలు తహసీల్దార్‌ కార్యాలయాలను సందర్శించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆయా కార్యాలయాల వద్ద ఉద్యోగులను ఉద్దేశించి బొప్పరాజు మాట్లాడారు. చట్టబద్ధంగా రావాల్సిన బకాయిలతో పాటు, అదనంగా కరవు భత్యం, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ ఉద్యమాన్ని ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21 నుంచి ‘వర్క్‌ టు రూల్‌’ పాటించాలని, ఏప్రిల్‌ 5 వరకు పోరు కొనసాగుతుందన్నారు. తర్వాత మలివిడత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని