విచారణ పేరుతో అవమానిస్తున్నారు

తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. అయినప్పటికీ తనను అవమానించేలా విచారణ జరుపుతున్నామంటూ నోటీసు బోర్డులో పేర్కొనడం దారుణమని కర్నూలు సర్వజన వైద్యశాలలో గ్రేడ్‌-1 పర్యవేక్షకురాలిగా పనిచేస్తున్న రామతులసమ్మ శనివారం విలపించారు.

Published : 19 Mar 2023 05:13 IST

కర్నూలు ఆసుపత్రి గ్రేడ్‌-1 నర్సింగ్‌ పర్యవేక్షకురాలు రామతులసమ్మ

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. అయినప్పటికీ తనను అవమానించేలా విచారణ జరుపుతున్నామంటూ నోటీసు బోర్డులో పేర్కొనడం దారుణమని కర్నూలు సర్వజన వైద్యశాలలో గ్రేడ్‌-1 పర్యవేక్షకురాలిగా పనిచేస్తున్న రామతులసమ్మ శనివారం విలపించారు. రోస్టర్‌ విధుల్లో డబ్బులు తీసుకున్నారని, దీనిపై 20న విచారణకు హాజరుకావాలంటూ ఆసుపత్రిలోని నోటీసు బోర్డుల్లో ఆదేశాల ప్రతిని పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందారు. తాను గుంటూరు నుంచి బదిలీపై కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చి నెల రోజులూ కాలేదని రామతులసమ్మ చెప్పారు. ‘ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో, నర్సింగ్‌ సిబ్బందికి డ్యూటీలు గతంలోనే వేశారు. నేను వేయలేదు. అయినా.. అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే తాఖీదులు ఇచ్చి విచారణ చేయాలి. అలా కాకుండా ఆసుపత్రిలోని నోటీసు బోర్డుల్లో పేర్కొనడం దారుణం. ఎస్సీ మహిళననే కక్ష గట్టారు. ఉద్దేశపూర్వకంగా నోటీసు బోర్డులో పెట్టారు. వివిధ కాంట్రాక్టర్ల నుంచి రూ.లక్షలు తీసుకొంటున్నారనే ఆరోపణలున్న ఆసుపత్రి పర్యవేక్షకుడిపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలి. ఆయనే కక్ష గట్టి అవమానిస్తున్నారు. దీనిని భరించలేక చావాలనిపిస్తోంది’ అని విలపించారు. ఈ విషయమై సీఎస్‌ఆర్‌ఎంవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆమెకు ఇచ్చిన నోటీసు.. బోర్డుల్లో పెట్టినట్లు తెలియదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు