భూ సమస్య పరిష్కరించలేదని సెల్‌టవర్‌ ఎక్కి రైతు నిరసన

భూ సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ జిల్లా వీరపునాయునిపల్లెకు చెందిన రైతు సోమా మనోహరరెడ్డి శనివారం తన పొలంలోని సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు.

Published : 19 Mar 2023 05:13 IST

వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే: భూ సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ జిల్లా వీరపునాయునిపల్లెకు చెందిన రైతు సోమా మనోహరరెడ్డి శనివారం తన పొలంలోని సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. విషయం తెలిసి తహసీల్దారు ఉదయభారతి, సిబ్బంది, పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతు టవర్‌ పైనుంచి కిందికి దిగారు. రైతు మాట్లాడుతూ దాయాదుల మధ్య భూ సమస్య ఉందని, కొలతలు వేసి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు వినతులు ఇచ్చి నాలుగైదేళ్లు అవుతున్నా పరిష్కరించలేదని ఆరోపించారు. విధిలేక నిరసన తెలపాల్సి వచ్చిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు