ఆకులు కాదు మొక్కలే

ఆకులను తలపిస్తున్న ఈ మొక్కల పేరు హోయా. సర్క్యులెంట్స్‌ జాతికి చెందిన ఈ మొక్కలను థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు.

Published : 19 Mar 2023 05:13 IST

ఆకులను తలపిస్తున్న ఈ మొక్కల పేరు హోయా. సర్క్యులెంట్స్‌ జాతికి చెందిన ఈ మొక్కలను థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆకులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు ఆక్సిజన్‌ విడుదల చేస్తుంది. వీటిని ఇంటిలోపలా పెంచుకోవచ్చు. ఎక్కువగా ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ మొక్కలను బహుమతిగా ఇస్తుంటారు. తిరుపతి జిల్లా చెర్లోపల్లి నుంచి శ్రీనివాసమంగాపురానికి వెళ్లే మార్గంలోని నర్సరీలో ఇవి కన్పించాయి.

ఈనాడు, తిరుపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు