AP Govt: పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ విద్యాహక్కు చట్టం 1982 సవరణ బిల్లును ప్రభుత్వం ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టింది.

Updated : 20 Mar 2023 08:43 IST

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ విద్యాహక్కు చట్టం 1982 సవరణ బిల్లును ప్రభుత్వం ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేలా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ గ్రంథాలయాల చట్టం 1962 సవరణ బిల్లును కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశ పెట్టారు. 2022 జవనరి 1వ తేదీ నుంచి 2022 నవంబరు 29 మధ్య అరవై సంవత్సరాలు నిండి, సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన గ్రంథాలయ సంస్థల ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని