AP Govt: ఎవరి గ్లాసు వారే తెచ్చుకోండి.. రాగి జావ పోస్తాం
రాగిజావ తీసుకోవడానికి విద్యార్థులు ఇంటి నుంచి గ్లాసులను తెచ్చుకోవాలని విద్యాశాఖ సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లోనే గ్లాసుల్ని అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
విద్యార్థులకు విద్యాశాఖ సూచన
ఈనాడు, అమరావతి: రాగిజావ తీసుకోవడానికి విద్యార్థులు ఇంటి నుంచి గ్లాసులను తెచ్చుకోవాలని విద్యాశాఖ సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లోనే గ్లాసుల్ని అందుబాటులో ఉంచుతామని తెలిపింది. రాగిపిండి అందుబాటులో లేదని ఒకసారి, ఎన్నికల నియమావళి పేరుతో మరోసారి రాగిజావ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ప్రభుత్వం ఈ నెల 21 నుంచి అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా గ్లాసుల కొనుగోలుకు టెండర్లు పిలిచినప్పటికీ సరఫరాకు నెల వరకు పట్టే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు వారి గ్లాసులను తెచ్చుకునేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అధికారులకు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. గ్లాసులు తెచ్చుకోని విద్యార్థులకు జావ ఇవ్వకుండా ఉండొద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 38 లక్షల మంది విద్యార్థులకు వారానికి మూడు రోజులు రాగిజావ, మరో మూడు రోజులు చిక్కీ అందిస్తారు. దీనికి అవసరమైన రాగిపిండి, బెల్లాన్ని శ్రీసత్యసాయి ట్రస్ట్ ఉచితంగా అందిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tirupati: గోవిందరాజస్వామి ఆలయంలో అపశ్రుతి.. రావిచెట్టు కూలి వ్యక్తి మృతి
-
Movies News
Varun Tej - Lavanya Tripati: వరుణ్ తేజ్ అక్కడ - లావణ్య ఇక్కడ.. పెళ్లి వార్తలు నిజమేనా?
-
Politics News
TDP: ‘బాబాయిని చంపిందెవరు’.. యువగళం పాదయాత్రలో పోస్టర్లతో ప్రదర్శన
-
Sports News
AUS vs IND WTC Final: జూలు విదల్చాలి.. గద పట్టాలి!
-
Crime News
Hyderabad: ‘25న నా పెళ్లి.. జైలుకెళ్లను’.. కోర్టులో రిమాండ్ ఖైదీ వీరంగం
-
World News
India- Nepal: హిట్ నుంచి సూపర్ హిట్‌కు..! నేపాల్‌తో సంబంధాలపై ప్రధాని మోదీ